Puri Jagannadh: విజయ్ దేవరకొండ పాత్రను డిజైన్ చేయడం వెనుక బన్నీ ఉన్నాడు: పూరి

Puri Interview

  • పూరిని ఇంటర్వ్యూ చేసిన సుకుమార్
  • 'లైగర్' సినిమా చుట్టూ నడచిన సంభాషణ 
  • బన్నీ వల్లనే ఆ ఆలోచన వచ్చిందన్న పూరి 
  • విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నట్టు చెప్పిన సుకుమార్  

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించిన 'లైగర్' సినిమా, పాన్ ఇండియా స్థాయిలో రేపు థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుకుమార్ చేసిన ఇంటర్వ్యూలో పూరి మాట్లాడుతూ .. "ఒకసారి బన్నీ నాతో మాట్లాడుతూ, 'హీరోకి ఏదైనా ఒక లోపం పెట్టి, అతని పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేయవచ్చును గదా' అన్నాడు. 

హీరోకి 'నత్తి' ఉన్నట్టుగా చూపిస్తే ఎలా ఉంటుందని అడిగితే సూపర్ గా ఉంటుందని అన్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని అనుకున్న నేను ఈ బాక్సింగ్ కథ వైపు వెళ్లాను. విజయ్ దేవరకొండ పాత్రకి 'నత్తి' పెట్టాను. అలా ఈ పాత్రను డిజైన్ చేయడం వెనుక బన్నీ ఉన్నాడు. విజయ్ దేవరకొండ ఈ పాత్రను గొప్పగా చేశాడు" అని చెప్పాడు.  

"విజయ్ దేవరకొండ 'నత్తి'గా మాట్లాడటం పైనే ఆ పాత్ర గొప్పతనం ఆధారపడి ఉంటుందని చెప్పిన రమ్యకృష్ణగారు, తొలిరోజున అతని యాక్టింగ్ చూసి క్లాప్స్ కొట్టేసింది" అని పూరి చెప్పగా, తన నెక్స్ట్ మూవీ విజయ్ దేవరకొండతోనే ఉందని సుకుమార్ క్లారిటీ ఇవ్వడం మరో విశేషం.

Puri Jagannadh
Sukumar
Liger Movie
  • Loading...

More Telugu News