Sudeep: 'రాక్షసుడు 2'లో విలన్ గా విజయ్ సేతుపతి!

Rakshasudu 2 Movie Update

  • 'రాక్షసుడు 2'ను రెడీ చేస్తున్న రమేశ్ వర్మ 
  • కథానాయకుడిగా వినిపిస్తోన్న సుదీప్ పేరు 
  • ఆయన సరసన జోడీగా మాళవిక మోహనన్
  • అందరిలో ఆసక్తిని రేపుతున్న కాంబినేషన్  

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన 'రాక్షసుడు' భారీ విజయన్ని సాధించింది. దర్శకుడిగా ఈ సినిమా రమేశ్ వర్మకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ ఖాతాలోను ఒక సక్సెస్ చేరిపోయింది. ఇప్పడు రమేశ్ వర్మ నుంచి 'రాక్షసుడు 2' టైటిల్ తో మరో సినిమా రూపొందుతోంది. 
 
ఫస్టు పార్టు మాదిరిగా ఇది సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లోనే సాగుతుంది .. అలా అని చెప్పేసి ఇది ఆ సినిమాకి సీక్వెల్ కాదు. ఈ కథ వేరు .. వేరే ఆర్టిస్టులతో .. కొత్త కథతో ముందుకు వెళుతుంది. ఈ సినిమాలో స్టార్ హీరో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా తెరపైకి సుదీప్ .. విజయ్ సేతుపతి పేర్లు వచ్చాయి. 

సుదీప్ హీరోగా ఈ సినిమాలో కనిపించనుండగా, ఆయన సరసన నాయికగా మాళవిక మోహనన్ అలరించనుంది. ఇక విలన్ పాత్రలో విజయ్ సేతుపతి చేయనున్నాడని అంటున్నారు. ఈ తరహా కథలకు సుదీప్ బాగా సెట్ అవుతాడు. అందువలన ఈ సినిమాపై అందరిలో మరింత ఆసక్తి పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Sudeep
Vijay Sethupathi
Malavika Mohanan
Rakshasudu Movie
  • Loading...

More Telugu News