Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Police arrested Raja Singh

  • మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి మాట్లాడుతూ వీడియో విడుదల చేసిన రాజాసింగ్
  • ఆందోళనలకు దిగిన ముస్లింలు
  • రాజాసింగ్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు

మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజీసింగ్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి మాట్లాడుతూ రాజాసింగ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ఉద్రిక్తతలకు కారణమయింది. బషీర్ బాగ్ లోని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ఎదుట ఒక సామాజిక వర్గానికి చెందిన ఆందోళనకారులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఆందోళకారులను అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

మరోవైపు తాజాగా రాజాసింగ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను షాహినాయత్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు, రాజాసింగ్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. రాజాసింగ్ వీడియోపై ఎంఐఎం పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీశారంటూ పలు పోలీస్ స్టేషన్ల ఎదుట ఆందోళన చేపట్టారు.

Raja Singh
BJP
Arrest
  • Loading...

More Telugu News