Sania Mirza: గాయపడిన సానియా మీర్జా.. యూఎస్ ఓపెన్ కు దూరం

Sania Mirza injured

  • సానియా మోచేతికి గాయం
  • కెనడాలో ఆడుతుండగా గాయపడ్డానన్న సానియా
  • కొన్ని వారాల పాటు ఆటకు దూరంగా ఉండబోతున్నానని వెల్లడి

ఇండియన్ ఏస్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గాయపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తన మోచేతికి గాయమయిందని తెలిపింది. గాయం కారణంగా యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నానని చెప్పింది. 

'హాయ్ గయ్స్. ఒక క్విక్ అప్డేట్. నా దగ్గర అంత గొప్ప వార్త ఏమీ లేదు. రెండు వారాల క్రితం కెనడాలో ఆడుతున్నప్పుడు మోచేతికి గాయమయింది. నిన్న స్కానింగ్ చేయించుకునేంత వరకు ఆ గాయం ఎంత తీవ్రమైనదో నాకు అర్థం కాలేదు. మోచేతి దగ్గర లిగమెంట్ కాస్త దెబ్బతింది. ఈ కారణంగా కొన్ని వారాల పాటు ఆటకు దూరంగా ఉండబోతున్నాను. యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నా. ఈ పరిణామాల నేపథ్యంలో నా రిటైర్మెంట్ ప్లాన్స్ లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తా. లవ్... సానియా' అని ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది.

మరోవైపు, సానియా గాయపడిందనే వార్తతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు.

Sania Mirza
Tennis
India
Injury
  • Loading...

More Telugu News