Chiranjeevi: చిరూ నేరుగా తన కారు తీసుకెళ్లి ఓ పాన్ డబ్బా దగ్గర ఆపారు: పూరి

Puri Interview

  • ఈ రోజున మెగాస్టార్ బర్త్ డే
  • వెల్లువెత్తుతున్న  ప్రముఖుల శుభాకాంక్షలు  
  • ఆయనతో ఉన్న ఓ జ్ఞాపకాన్ని పంచుకున్న పూరి
  • 15 ఏళ్ల క్రితం నాటి సంగతి అంటూ వెల్లడి

ఈ రోజున చిరంజీవి బర్త్ డే కావడం వలన, ఆయనతో తమకి గల అనుబంధాన్ని గురించి అంతా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ .. "పదిహేనేళ్ల క్రితం ఒకసారి చిరంజీవిగారు నన్ను సరదాగా తన కార్లో కూర్చోబెట్టుకుని మాదాపూర్ పరిసరాలకు తీసుకుని వెళ్లారు. అప్పటికి ఆ ఏరియా ఇంకా డెవలప్ కాలేదు. 

చిరంజీవిగారు నేరుగా కారును తీసుకుని వెళ్లి ఒక పాన్ డబ్బా ముందు ఆపారు. పాన్ కట్టే వ్యక్తి చిరంజీవి గారిని చూసి షాక్ అయ్యాడు. పాన్ కట్టమని చిరంజీవిగారు చెప్పడంతో, తనకళ్లను తానే నమ్మలేకపోతూ .. కంగారు కంగారుగా కట్టేశాడు. తన ఆనందాన్ని చుట్టుపక్కలవారితో పంచుకోవాలనే ఉద్దేశంతో  'మెగాస్టార్ .. మెగాస్టార్' అంటూ అరిచాడు.

కానీ .. పాపం ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. చిరంజీవిగారు పాన్ తీసుకున్న తరువాత అక్కడి నుంచి బయల్దేరాము. ఆ రోజున ఆ పాన్ డబ్బా వ్యక్తి ఎగ్జైట్ మెంట్ ఇప్పటికీ నా కళ్లముందు కదలాడుతూనే ఉంది. చిరంజీవిగారు తన పాన్ డబ్బాకి వచ్చాడనే విషయాన్ని ఆ తరువాత అతను చెప్పినా ఎవరూ నమ్మి ఉండరు పాపం" అంటూ చెప్పుకొచ్చాడు.

Chiranjeevi
Puri Jagannadh
Tollywood
  • Loading...

More Telugu News