Rajanikanth: సెట్స్ పైకి 'జైలర్' .. రజనీ పోస్టర్ రిలీజ్!

Jailer poster Released

  • 'జైలర్' గా రజనీకాంత్
  • జైలు చుట్టూ తిరిగే కథ 
  • ఈ రోజునే మొదలైన షూటింగ్ 
  • దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ 
  • సంగీతాన్ని సమకూర్చుతున్న అనిరుధ్ 

రజనీకాంత్ ఈ మధ్య కాలంలో యువ దర్శకులకు ఎక్కువగా అవకాశాలనిస్తూ వెళుతున్నారు. 'కబాలి' నుంచి ఆయన యువ దర్శకులతోనే ఎక్కువగా కలిసి పనిచేస్తున్నారు. అలా ఆయన పా.రంజిత్ .. కార్తీక్ సుబ్బరాజ్ .. శివతో సినిమాలు చేస్తూ వచ్చారు. ఈ సినిమాల ఫలితాల సంగతి అలా ఉంచితే రజనీని కొత్తగా చూపించడంలో వాళ్లు సక్సెస్ అయ్యారు.

తాజాగా ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తున్న  'జైలర్' సినిమా ఈ రోజునే సెట్స్ పైకి వెళ్లింది. నెల్సన్ దిలీప్ తయారు చేసుకునే కథలు .. ఆయన స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటాయి. స్టార్ హీరోల సినిమాలను తక్కువ బడ్జెట్ లో చేయడం ఆయన ప్రత్యేకత. ఇదే విషయాన్ని 'బీస్ట్' సినిమా నిరూపించింది. అందువల్లనే సన్ పిక్చర్స్ వారు ఆయనకి మరో ఛాన్స్ ఇచ్చారు.

'జైలర్' టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి రజనీ పోస్టర్ ను వదిలారు. డిఫరెంట్ లుక్ తో చాలా సీరియస్ గా రజనీ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 'బీస్ట్'లో కథ అంతా కూడా షాపింగ్ మాల్ చుట్టూ తిరిగితే, ఈ సినిమాలో కథ అంతా కూడా 'జైలు' చుట్టూ తిరుగుతుందట.

Rajanikanth
Nelson Dileep Kumar Movie
Jailer
  • Loading...

More Telugu News