India: దేశంలో అదుపులో ఉన్న కరోనా.. అప్డేట్స్ ఇవిగో!

India corona updates

  • గత 24 గంటల్లో 13,272 కేసుల నమోదు
  • ఇదే సమయంలో కోలుకున్న వారి సంఖ్య 13,900
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,01,166 

దేశంలో కరోనా కేసుల వ్యాప్తి అదుపులోనే ఉంది. ఒకరోజు కేసులు పెరగడం, మరో రోజు తగ్గడం జరుగుతున్నప్పటికీ... మొత్తం మీద మహమ్మారి అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 3.15 లక్షల మందికి వైద్య పరీక్షలను నిర్వహించగా... 13,272 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

 ఇదే సమయంలో 13,900 మంది కరోనా నుంచి కోలుకోగా... 36 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,01,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో 2,285 కేసులు, కర్ణాటకలో 1,573 కేసులు, ఢిల్లీలో 1,417 కేసులు, కేరళలో 1,093 కేసులు నమోదు కావడం గమనార్హం. 

ఇక ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 4.21 శాతంగా, క్రియాశీల రేటు 1.01 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4.43 కోట్ల మందికి కరోనా సోకగా... వీరిలో 98.58 శాతం మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 209 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు.

India
Corona Virus
Updates
  • Loading...

More Telugu News