ఇకపై ఇదే నా స్టైల్: పూరి
- పూరి తాజా చిత్రంగా రూపొందిన 'లైగర్'
- ఆయన కెరియర్లో ఎక్కువ సమయం తీసుకున్న సినిమా
- ఇకపై కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతానంటూ వ్యాఖ్య
- ఈ నెల 25వ తేదీన విడుదలవుతున్న సినిమా
కోవిడ్ కారణంగా .. కరణ్ జొహార్ నిర్మాణ భాగస్వామిగా మారడం వలన .. పాన్ ఇండియా రిలీజ్ అనుకోవడం వలన 'లైగర్' సినిమా పూర్తికావడానికి ఆలస్యమైందిగానీ, ఈ సమయంలో మూడు సినిమాలు చేయగల సమర్థుడు ఆయన. ఈ సినిమా తరువాత పూరి మళ్లీ అంతకుముందులా చెలరేగిపోతాడనుకోవడం సహజం. కానీ అలా జరగదని తాజా ఇంటర్వ్యూలో పూరి చెప్పాడు.
ఇంతకుముందులా తన నుంచి క్విక్ ప్రాజెక్టులు ఉండవని పూరి అన్నాడు. ప్రతి ప్రాజెక్టుకి కొంత సమయం తీసుకోవడం జరుగుతుందనీ, ఆ తరువాతనే అది సెట్స్ పైకి వెళుతుందని అన్నాడు. తెలుగు సినిమాలకి నార్త్ లో మంచి ఆదరణ లభిస్తూ ఉండటం .. పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడటం ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.