Ian Chappell: 45 ఏళ్ల సుదీర్ఘ కామెంటరీ కెరియర్‌కు తెరదించిన ఇయాన్ చాపెల్
- 1964-1980 మధ్య ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన ఇయాన్ చాపెల్
- 75 టెస్టుల్లో 5,345 పరుగులు సాధించిన చాపెల్
- 2019లో చర్మకేన్సర్ బారినపడి కోలుకున్న వైనం
- ఇటీవల స్వల్ప గుండెపోటు
నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ కామెంటరీ కెరియర్‌కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ వీడ్కోలు పలికాడు. 1964-1980 మధ్య ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన చాపెల్ 75 టెస్టులు ఆడి 5,345 పరుగులు చేశాడు. 30 టెస్టులకు సారథ్యం వహించాడు. అలాగే, 1971-80 మధ్య 16 వన్డేలు ఆడిన చాపెల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కామెంటేటర్‌గా అవతారం ఎత్తాడు.
2019లో చర్మ కేన్సర్ బారినపడిన 78 ఏళ్ల చాపెల్ ఐదు వారాల చికిత్స తర్వాత కోలుకున్నాడు. అలాగే కొన్నేళ్ల క్రితం స్వల్ప గుండెపోటుకు గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆయన కామెంటరీ కెరియర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. గుండెపోటు తర్వాత జీవితం చాలా క్లిష్టంగా మారిందన్న చాపెల్.. కామెంటరీ గురించి ఆలోచించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కాగా, ఇయాన్ చాపెల్, రిచీ బెనాడ్, బిల్ లారీ, టోని గ్రెయిగ్‌లతో కూడిన బృందం ‘చానల్ 9’కు సేవలందించింది.