Vijay Devarakonda: నన్ను సూపర్ స్టార్ అనకండబ్బా: విజయ్ దేవరకొండ

Liger movie update

  • వరంగల్ లో 'లైగర్' టీమ్ సందడి  
  • భారీ సంఖ్యలో తరలి వచ్చిన జనం 
  • పూరి డైలాగ్స్ అదుర్స్ అంటూ విజయ్ వ్యాఖ్య 
  • బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమంటూ ఫాన్స్ కి భరోసా

విజయ్ దేవరకొండ హీరోగా పూరి రూపొందించిన 'లైగర్' ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా 'ఫ్యాన్ డమ్ టూర్'ను మొదలుపెట్టిన ఈ సినిమా టీమ్ నిన్న వరంగల్ లో సందడి చేసింది. వర్షం ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలోనే జనం రావడం విశేషం. ఈ వేదికపై విజయ్ దేవరకొండ తనదైన స్టైల్లో మాట్లాడుతూ ఆకట్టుకున్నాడు. 

అభిమానులు సూపర్ స్టార్ .. సూపర్ స్టార్ అంటూ గోల చేస్తుండటంతో  .. "నన్ను సూపర్ స్టార్ అనకండబ్బా, చాలా ఇబ్బందిగా ఉంది. ఈ సినిమాలో హీరో కరీంనగర్ నుంచి ముంబైకి బయల్దేరినట్టు , హీరోగా నేను నా అడుగులను హైదరాబాద్ నుంచి మొదలుపెట్టాను. నేను చాలా చిన్నోడిని .. సూపర్ స్టార్ అనిపించుకునే స్థాయికి ఇంకా రాలేదు .. సాధించవలసింది చాలా ఉంది" అన్నాడు.    

పూరి గురించి ప్రస్తావిస్తూ .. "పూరి డైలాగులు ఎలా ఉంటాయనేది మీకు తెలిసిందే. ఆయన రాసిన డైలాగులు చెప్పాలంటే అదృష్టం ఉండాలి. ఈ సినిమాతో అలాంటి అదృష్టం నాకు కూడా పట్టింది. సినిమా విషయంలో డౌట్ లేదు భయ్యా .. తప్పకుండా బ్లాక్ బస్టర్ కొడుతుంది. మీరు వరంగల్ ను షేక్ చేయండి. ఇండియా మొత్తం వినిపించేలా విజిల్స్ కొట్టండి" అంటూ చెప్పుకొచ్చాడు.

Vijay Devarakonda
Ananya Panday
Liger Movie
  • Loading...

More Telugu News