Naina Jaiswal: నైనా జైశ్వాల్‌ను వేధించిన పోకిరి పేరు శ్రీకాంత్... అరెస్ట్ చేసిన పోలీసులు
![srikanth who harassed naina jaiswal arrested](https://imgd.ap7am.com/thumbnail/cr-20220813tn62f7b77324de8.jpg)
సోషల్ మీడియా వేదికగా నైనా జైస్వాల్‌కు వేధింపులు
అసభ్యకర మెసేజ్‌లతో వేధించిన శ్రీకాంత్
జైస్వాల్ ఫిర్యాదుతో నిందితుడిని పట్టేసిన పోలీసులు
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురి చేసిన పోకిరిని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. నిందితుడిని శ్రీకాంత్‌గా గుర్తించిన పోలీసులు శనివారం అతడిని అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా నైనా జైస్వాల్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపిన శ్రీకాంత్.. ఆమెను తీవ్రంగా వేధించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై శుక్రవారం నైనా జైస్వాల్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వేగంగా రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఆ వెంటనే అతడు ఎక్కడున్నాడన్న విషయాన్ని తెలుసుకుని అతడిని అరెస్ట్ చేశారు.