Tecno Camon: ప్రీమియం లుక్ తో విడుదలైన టెక్నో కెమాన్ 19 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్

Tecno Camon 19 Pro 5G launched in India
  • ఒకటే వేరియంట్ గా విడుదల
  • 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ.21,999
  • టెక్నోవెబ్ సైట్ తోపాటు ఆఫ్ లైన్ స్టోర్లలో విక్రయాలు
టెక్నో సంస్థ టెక్నో కెమాన్ 19 ప్రో 5జీ పేరుతో నూతన స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. కెమెరా ప్రియులు నచ్చే ఫీచర్లు ఫోన్లో ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, హైబ్రిడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సెన్సార్లను ఏర్పాటు చేశారు. దీంతో ఫొటోలు బ్లర్ కాకుండా, మరింత స్పష్టంగా తీసుకోవచ్చు.

8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో వచ్చే ఈ ఫోన్ ధర రూ.21,999. సెడార్ గ్రీన్, ఎకో బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. టెక్నో వెబ్ సైట్ తోపాటు, ఆఫ్ లైన్ స్టోర్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఫోన్ లో 6.8 అంగుళాల పెద్ద ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. 120 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. మీడియాటెక్ డైమిన్సిటీ 810 ఎస్ వోసీ చిప్ సెట్ తో పనిచేస్తుంది. 

వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. 64 మెగా పిక్సల్ ప్రైమరీ సెన్సార్ ఇందులో ఒకటి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. మైక్రో ఎస్డీ కార్డుతో స్టోరేజీ పెంచుకోవచ్చు. 4జీ వోల్టేతోపాటు, 5జీలో 12 బ్యాండ్లకు సపోర్ట్ చేస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని 33 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వేగంగా చార్జ్ చేసుకోవచ్చు.
Tecno Camon
19 Pro 5G
smart phone
launched
5g

More Telugu News