Telangana: తెలంగాణలో 500కి దిగువన కరోనా కొత్త కేసులు
![Telangana corona report](https://imgd.ap7am.com/thumbnail/cr-20220809tn62f287bcbc71e.jpg)
- గత 24 గంటల్లో 31,629 కరోనా పరీక్షలు
- 494 పాజిటివ్ కేసుల వెల్లడి
- హైదరాబాదులో 223 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 1,054 మంది
- ఇంకా 5,107 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య మరింత దిగొచ్చింది. గడచిన 24 గంటల్లో 31,629 శాంపిల్స్ పరీక్షించగా, 494 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 223, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 36, రంగారెడ్డి జిల్లాలో 34 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 1,054 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
తెలంగాణలో ఇప్పటివరకు 8,26,778 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,17,560 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,107 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
![](https://img.ap7am.com/froala-uploads/20220809fr62f28795515a5.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220809fr62f287a580bd0.jpg)