Telangana: తెలంగాణలో తాజాగా 396 మందికి కరోనా
![Telangana corona status details](https://imgd.ap7am.com/thumbnail/cr-20220807tn62efe1fd01686.jpg)
- గత 24 గంటల్లో 24,938 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 193 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 705 మంది
- ఇంకా 5,910 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 24,938 కరోనా పరీక్షలు నిర్వహించగా, 396 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 193 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27, రంగారెడ్డి జిల్లాలో 23 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 705 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.
తెలంగాణలో ఇప్పటిదాకా 8,25,756 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,15,735 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,910 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
![](https://img.ap7am.com/froala-uploads/20220807fr62efe1db14e99.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220807fr62efe1e963cf9.jpg)