Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ దందా కలకలం... ఐదుగురి అరెస్ట్

Visakha police arrests five people in drugs case
  • నగరంలో డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నం
  • విశాఖకు చెందిన నలుగురు, బెంగళూరుకు చెందిన ఒకరు అరెస్ట్
  • పరారీలో దిలీప్ అనే వ్యక్తి
  • విశాఖ, గోవా మధ్య డ్రగ్స్ లింకు
విశాఖలో డ్రగ్స్ దందా గుట్టు రట్టయింది. డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నించిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన వాసుదేవ, మోజెస్, రవికుమార్, కిశోర్, బెంగళూరుకు చెందిన సందీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి డ్రగ్స్, ఐదు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో దిలీప్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. 

దీనిపై నగర పోలీస్ కమిషనర్ వివరాలు తెలిపారు. రవికుమార్ గంజాయిని గోవాలో ఉండే దిలీప్ కు అందించేవాడని వెల్లడించారు. దిలీప్ ద్వారా డ్రగ్స్ విశాఖకు తీసుకొచ్చి అమ్మేవారని వివరించారు. ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూపులు, డార్క్ వెబ్ ద్వారా విక్రయం జరిపేవారని పోలీస్ కమిషనర్ తెలిపారు. క్రిప్టో కరెన్సీ, యూపీఐ ఆధారిత చెల్లింపుల సాయంతో డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్నారని వెల్లడించారు.
Visakhapatnam
Police
Arrest
Drugs
Goa

More Telugu News