liger: లైగర్ నుంచి రొమాంటిక్ వీడియో సాంగ్ వచ్చేసింది

Liger song Aafat out

  • ‘ఆఫట్’ పాటను విడుదల చేసిన చిత్ర బృందం
  • తెలుగు వెర్షన్ కు భాస్కరభట్ల సాహిత్యం
  • ఈ నెల 25న విడుదల అవుతున్న చిత్రం 

విజయ్ దేవరకొండ, అనన్యా పాండే హీరో హీరోయిన్లుగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ నుంచి మరో సర్ ప్రైజ్  వచ్చేసింది. ‘ఆఫ‌ట్’ అంటూ సాగే రొమాంటిక్ వీడియో సాంగ్ ను చిత్ర బృందం శనివారం ఉదయం విడుదల చేసింది. ఈ సంవత్సరంలోనే అత్యంత ఉత్సాహాన్నిచ్చే పాట అంటూ విజయ్ ట్వీట్ చేశాడు. తెలుగు వెర్షన్ కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సింహా, శ్రావ‌ణ భార్గవి ఆలపించారు. త‌నిష్క్ బాగ్చీ సంగీతం స‌మ‌కూర్చారు.

పియూష్, షాజియా కొరియోగ్రఫీ అందించిన ఈ పాటలో విజయ్ సాఫ్ట్ స్టెప్స్ తో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో అనన్య, విజయ్ మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకునేలా ఉంది. వాస్తవానికి ఈ పాటను శుక్రవారమే విడుద‌ల చేయాల‌నుకున్నా.. సాంకేతిక కార‌ణాల‌ వల్ల ఒక రోజు ఆలస్యంగా వచ్చింది. పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రంతో విజయ్ బాలీవుడ్లో అడుగు పెడుతున్నాడు. ఈ నెల 25న హిందీ, తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో  ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. 

ఇటీవ‌ల విడుదలైన ట్రైల‌ర్ తో పాటు అక్డి పక్డి పాట, వాట్ లగా దేంగే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మైక్ టైసన్, రోనిత్ రాయ్, విషురెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో పూరి, చార్మి, కరణ్ జొహార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

liger
movie
new song
Vijay Devarakonda
ananya pande
Puri Jagannadh
Bollywood

More Telugu News