Bandi Sanjay: పాదయాత్రకు విరామం ప్రకటించి.. ఢిల్లీకి బయల్దేరుతున్న బండి సంజయ్

Bandi Sanjay going to Delhi

  • ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్న బండి సంజయ్
  • జేపీ నడ్డా, అమిత్ షాలను కలిసే అవకాశం
  • మునుగోడు సభ, పాదయాత్ర ముగింపు సభలకు ఆహ్వానించనున్నట్టు సమాచారం

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రకు విరామం ప్రకటించారు. కాసేపట్లో ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసే అవకాశం ఉంది. 

ఈనెల 21న మునుగోడులో బహిరంగసభ, పాదయాత్ర ముగింపు సభలకు వీరిద్దరినీ ఆయన ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను బీజేపీ అగ్రనేతలకు ఆయన వివరించనున్నారు.

Bandi Sanjay
BJP
Delhi
Amit Shah
JP Nadda
  • Loading...

More Telugu News