Budda Venkanna: ఇప్పుడు ఎంపీపై చర్యలు తీసుకుంటారో, అంబటిలా పదవి ఇచ్చి గౌరవిస్తారో చూద్దాం: బుద్ధా వెంకన్న

Budda Venkanna opines on Gorantla Madhav issue

  • దుమారం రేపుతున్న ఎంపీ మాధవ్ నగ్న వీడియో కాల్
  • గోరంట్ల మాధవ్ పార్టీ పేరు సార్థకం చేస్తున్నాడన్న బుద్ధా 
  • మరో ట్రెండ్ సెట్టర్ అంటూ వ్యంగ్యం

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్సీ, పార్టీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న స్పందించారు. శివకుమార్ అనే వ్యక్తి నుంచి వైఎస్ జగన్ రెడ్డి ముందుగా లీజుకు తీసుకుని, ఆ తర్వాత పూర్తి యాజమాన్య హక్కులు సంపాదించిన యువజన శృంగార రసిక చిలిపి పార్టీ పేరును ఎంపీ గోరంట్ల మాధవ్ సార్థకం చేస్తున్నాడని సెటైర్ వేశారు. పార్టీలో గోరంట్ల మాధవ్ మరో ట్రెండ్ సెట్టర్ అని వ్యంగ్యం ప్రదర్శించారు. 

వైసీపీ ఆశీస్సులతో ఇప్పటివరకు అవంతి అరగంట సరసం, అంబటి గంట విరహం ఆడియోలు బయటికొచ్చినా వారిపై జగన్ ఏ చర్యలు తీసుకోలేదని బుద్ధా విమర్శించారు. 

పార్టీ బ్రాండింగ్ అయిన ఇలాంటి రాసలీలలు చేయడం కాదు... బయటపెట్టుకుంటేనే అధినేత గుర్తిస్తున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్ భావించారని, అందుకే ఆయన న్యూడ్ గా మహిళను లైంగికంగా వేధింపులకు గురిచేస్తూ వీడియో వదిలారని వివరించారు. ఇప్పుడు ఎంపీపై చర్యలు తీసుకుంటారో, అంబటిలా పదవి ఇచ్చి గౌరవిస్తారో చూద్దాం అంటూ బుద్ధా ట్విట్టర్ లో స్పందించారు.

Budda Venkanna
Gorantla Madhav
Video Call
TDP
YSRCP
  • Loading...

More Telugu News