CM Jagan: ఎస్సీ కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్
![CM Jagan attends Pedapati Ammaji daughter wedding](https://imgd.ap7am.com/thumbnail/cr-20220804tn62eba38bcfb5a.jpg)
డయానా వెడ్స్ సుధీర్
పాయకరావుపేటలో వివాహ వేడుక
వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
హాజరైన పలువురు మంత్రులు
ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ కుమార్తె డయానా వివాహ వేడుక అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. వధూవరులు డయానా, సుధీర్ లకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి తన ఆశీస్సులు అందజేశారు. వధువు డయానా సెల్ఫీ అడగ్గా, ఆనందంగా సహకరించారు.
ఈ వివాహ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు మంత్రులు ఆదిమూలపు సురేశ్, దాడిశెట్టి రాజా, పినిపె విశ్వరూప్, ఎంపీ సత్యవతి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ తదితరులు హాజరయ్యారు. కాగా, ప్రతి ఏటా రక్షాబంధన్ పర్వదినం నాడు సీఎం జగన్ కు రాఖీ కట్టే వైసీపీ మహిళా నేతల్లో పెదపాటి అమ్మాజీ కూడా ఒకరు.
![](https://img.ap7am.com/froala-uploads/20220804fr62eba371bda8d.jpg)