Telangana: బర్మింగ్‌హామ్‌లో తెలంగాణ మంత్రి... ఫొటోలు ఇవిగో!
![ts minister srinivas goud enjoys Indian Mens Hockey match in Birmingham 2022 Commonwealth Games](https://imgd.ap7am.com/thumbnail/cr-20220803tn62ea9d121bd78.jpg)
- నిన్న టీ షర్ట్, జీన్స్‌లో దర్శనమిచ్చిన శ్రీనివాస్ గౌడ్
- తాజాగా కామన్వెల్త్ క్రీడా వేదికలో ప్రత్యక్షమైన మంత్రి
- భారత జట్టు ఆడిన హాకీ మ్యాచ్‌ను ఎంజాయ్ చేసిన వైనం
తెలంగాణ కేబినెట్‌లో ఆబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖల మంత్రిగా కొనసాగుతున్న వి.శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ఖద్దరు వదిలేసి... టీ షర్ట్, జీన్స్ వేసుకుని దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించిన తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మంత్రి... తాను ఎక్కడికి వెళుతున్నానన్న విషయాన్ని మాత్రం వెల్లడించని సంగతి తెలిసిందే.
తాజాగా టీ షర్ట్, జీన్స్ వేసుకుని బయలుదేరిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేరుగా కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్న ఇంగ్లండ్ నగరం బర్మింగ్‌హామ్‌లో తేలారు. కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత జట్టు ఆడిన హాకీ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన తన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను మంత్రిని అన్న విషయాన్ని పక్కనపెట్టేసిన శ్రీనివాస్ గౌడ్... ఓ సాధారణ క్రీడా అభిమానిగా హాకీ మ్యాచ్‌ను చూస్తూ తెగ ఎంజాయ్ చేశారు. భారత పతాకాన్ని పట్టుకుని సందడి చేశారు.