Raviteja: 'ధమాకా' విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారట!

Dhamaka movie update

  • రవితేజ నెక్స్ట్ మూవీగా 'ధమాకా'
  • దర్శకుడిగా నక్కిన త్రినాథరావు 
  • కథానాయికగా అలరించనున్న శ్రీలీల
  • సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన

రవితేజ హీరోగా ఇటీవల ఆయన నుంచి 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా వచ్చింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ  సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో రవితేజ మార్క్ ఎంటర్టైన్ మెంట్ మిస్సయింది. అందుకు కారణం ఆయన పాత్ర కూడా అని చెప్పొచ్చు.

లాయర్ .. కలెక్టర్ వంటి పాత్రలు హీరో చేస్తే కచ్చితంగా కొన్ని పరిధులు ఏర్పడిపోతాయి. రొమాంటిక్ సాంగ్స్ .. మాస్ డైలాగ్స్ కుదరవు. అలాంటి పాత్రలు కామెడీ చేస్తే అసలు బాగుండదు. అందువలన 'రామారావు' ఆశించిన స్థాయి వినోదాన్ని అందించలేకపోయాడు. అంచనాలకు చాలా దూరంలోనే ఆగిపోయాడు. 

అందువల్లనే 'ధమాకా' మేకర్స్ తమ సినిమా కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ మార్క్ కామెడీ పాళ్లు ఎక్కవగా కలిపించే పనిలో పడ్డారట. శ్రీలీల కథానాయికగా సందడి చేయనున్న ఈ సినిమాను 'సంక్రాంతి'కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

Raviteja
Sreeleela
Dhamaka Movie
  • Loading...

More Telugu News