Vizag: అనకాపల్లి జిల్లాలో విష వాయువు లీక్... 50 మంది మహిళలకు అస్వస్థత
![50 women employees hospitalised due to gas leak in brandix company](https://imgd.ap7am.com/thumbnail/cr-20220802tn62e9392b690e5.jpg)
- అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఘటన
- వాంతులు, విరేచనాలతో స్పృహ తప్పిన మహిళా ఉద్యోగులు
- బాధితులను ఆసుపత్రులకు తరలించిన యాజమాన్యం
అనకాపల్లి జిల్లాలో విష వాయువు లీకైన ఘటన చోటుచేసుకుంది. మంగళవారం జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్ పరిశ్రమలో విష వాయువు లీకైంది. విష వాయువును పీల్చిన బ్రాండిక్స్‌కు చెందిన మహిళా ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం 50 మంది దాకా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. విష వాయువును పీల్చిన కారణంగా వీరంతా వాంతులు, విరేచనాలకు గురై స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితిని గమనించిన కంపెనీ యాజమాన్యం అస్వస్థతకు గురైన మహిళలను హుటాహుటీన ఆసుపత్రులకు తరలించింది.