Gold Medal: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు మరో పసిడి పతకం... కామన్వెల్త్ రికార్డు నెలకొల్పిన 19 ఏళ్ల జెరెమీ

Another gold for India in Commonwealth Games

  • 67 కిలోల కేటగిరీలో జెరెమీ లాల్ రినుంగాకు స్వర్ణం
  • భారత్ ఖాతాలో రెండో పసిడి పతకం
  • ఐదుకు చేరిన భారత్ పతకాల సంఖ్య
  • అన్ని పతకాలు వెయిట్ లిఫ్టింగ్ లోనే!
  • పతకాల పట్టికలో ఆరోస్థానం

బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ గణనీయమైన ప్రదర్శన కనబరుస్తోంది. తాజాగా, భారత్ కు మరో పసిడి పతకం లభించింది. వెయిట్ లిఫ్టింగ్ లో 67 కేజీల విభాగంలో 19 ఏళ్ల జెరెమీ లాల్ రినుంగ స్వర్ణం సాధించాడు. క్లీన్ అండ్ జెర్క్ లో 160 కేజీలతో కలిపి మొత్తం 300 కేజీల బరువునెత్తి కామన్వెల్త్ రికార్డ్ సహా పసిడి మోత మోగించాడు. చివరి ప్రయత్నంలో గాయపడినప్పటికీ అతడు పోరాటస్ఫూర్తి కనబర్చి భారత్ శిబిరంలో ఆనందోత్సాహాలు నింపాడు. 

ఈ పతకంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాల సంఖ్య ఐదుకి పెరిగింది. ఈ ఐదు పతకాలు వెయిట్ లిఫ్టింగ్ లోనే లభించడం విశేషం. ఇప్పటిదాకా భారత్ 2 స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. తద్వారా పతకాల పట్టికలో ఆరోస్థానానికి చేరింది.

Gold Medal
Jeremy Lalrinnunga
Weight Lifting
Commonwealth Games
  • Loading...

More Telugu News