TDP: సోనూ సూద్‌కు చంద్ర‌బాబు బ‌ర్త్ డే విషెస్‌... రియ‌ల్ హీరో అంటూ ప్ర‌శంస‌

chandrababu greet sonu so sood on his birth day

  • నేడు సోనూ సూద్ జ‌న్మ‌దినం
  • ట్విట్ట‌ర్ వేదిక‌గా చంద్రబాబు బ‌ర్త్ డే విషెస్‌
  • ప్ర‌జా సేవ‌లో మ‌రింత కాలం సాగాలని ఆకాంక్ష‌

ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా యావ‌త్తు ప్ర‌పంచాన్ని హ‌డ‌లెత్తిస్తున్న వేళ‌... జీవ‌నోపాధి కోసం సుదూర ప్రాంతాల‌కు వెళ్లి అక్క‌డే చిక్కుబ‌డిపోయిన వారిని వారి ఇళ్ల‌కు త‌ర‌లించేందుకు న‌డుం బిగించిన ప్ర‌ముఖ సినీ న‌టుడు సోనూ సూద్‌పై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. శ‌నివారం ఆయ‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న‌కు దేశ‌వ్యాప్తంగా బ‌ర్త్ డే గ్రీటింగ్స్ వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు శ‌నివారం సోష‌ల్ మీడియా వేదిక‌గా సోనూ సూద్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. ట్విట్టర్ వేదికగా తెలిపిన ఈ శుభాకాంక్షల్లో ఆయ‌న సోనూ సూద్‌ను రియ‌ల్ హీరోగా అభివ‌ర్ణించారు. ఆయురారోగ్యాల‌తో సోనూ సూద్ వ‌ర్ధిల్లాల‌ని ఆకాంక్షించిన చంద్ర‌బాబు.. ప్ర‌జ‌ల సేవ‌లో మ‌రింత కాలం సాగాల‌ని కోరారు.

TDP
Chandrababu
Sonu Sood
Corona Virus
Birth Day

More Telugu News