KTR: కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు సవాల్ విసిరిన కేటీఆర్

KTR challenges union minsiter Jyotiraditya Scindia

  • బీజేపీ నేతలపై ధ్వజమెత్తిన కేటీఆర్
  • మధ్యప్రదేశ్ దేంట్లో తెలంగాణ కంటే బాగుందో చూపాలన్న కేటీఆర్
  • దేశ జీడీపీలో 5 శాతం వాటా తెలంగాణదేనని వెల్లడి

తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోమారు బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. ఎదుగుబొదుగులేని రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతల చిత్తశుద్ధిని నిజంగా మెచ్చుకోవాల్సిందే అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. వారు తెలంగాణకు వచ్చి కుట్రలు, కుతంత్రాల్లో పాలుపంచుకుంటూ తమ విభజన రాజకీయ పర్వాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు కేటీఆర్ సవాల్ విసిరారు. సింథియా సొంతరాష్ట్రం మధ్యప్రదేశ్ ఏ ఒక్క అంశంలో అయినా తెలంగాణ కంటే మెరుగ్గా ఉందో చూపించాలని అన్నారు.  

దేశంలో 2.5 శాతం జనాభా కలిగివున్న తెలంగాణ భారతదేశ జీడీపీలో 5 శాతం వాటాను అందిస్తోందని కేటీఆర్ ఉద్ఘాటించారు. ప్రతి తెలంగాణ బిడ్డ ఒక డబుల్ ఇంజిన్ లా పనిచేస్తూ దేశ పురోగతికి పాటుపడుతున్నట్టు వివరించారు. ఒకవేళ బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ తెలంగాణలో అభివృద్ధి సాధించి ఉంటే 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి మనం 10 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను అందుకుని ఉండేవాళ్లమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News