Aamir Khan: ఆమిర్ ఖాన్ మనసు కొల్లగొట్టేసిన సుకుమార్!

Aamir Khan in Sukumar Movie

  • 'పుష్ప' సినిమాతో మారిపోయిన సుకుమార్ రేంజ్ 
  • బాలీవుడ్ హీరోలందరి దృష్టి ఆయన పైనే
  •  ఆల్రెడీ ఆమిర్ కి కథ వినిపించిన సుక్కూ
  • 'పుష్ప 2' తరువాత పట్టాలెక్కనున్న ప్రాజెక్టు అదేనంటూ టాక్   

బాలీవుడ్ హీరోలు ఎక్కడ టాలెంట్ ఉన్నా వెతికి పట్టుకుంటూ ఉంటారు. ఒకప్పుడు కోలీవుడ్ .. టాలీవుడ్ నుంచి కథలను మాత్రమే తీసుకుని, తమ దర్శకులతో రీమేకులు చేసుకునేవారు. ఆ తరువాత నుంచి ఈ పరిస్థితిలో మార్పు రావడం మొదలైంది. ఇక్కడి నుంచి దర్శకులనే తీసుకెళ్లి అక్కడ సినిమాలు చేయడం మొదలుపెట్టారు.

కోలీవుడ్  నుంచి మురుగదాస్ .. ప్రభుదేవా వెళ్లి హిందీ సినిమాలు చేయగా, ఇప్పుడు అదే దారిలో అట్లీ కుమార్ వెళుతున్నాడు. టాలీవుడ్ నుంచి పూరి వెళ్లి హిందీ సినిమా చేసి రాగా, అదే బాటలో సందీప్ రెడ్డి వంగా వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో 'పుష్ప' సినిమా చూసిన దగ్గర నుంచి సుకుమార్ తో సినిమా చేయడానికి ఆమిర్ ఖాన్ ఆసక్తిని చూపిస్తున్నారట. 

ఆమిర్ కి సుకుమార్ ఒక లైన్ వినిపించడం .. పూర్తి కథను రెడీ చేయమని ఆయన చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే 'పుష్ప 2' తరువాత సుకుమార్ చేసే సినిమా ఆమిర్ ఖాన్ దే అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 'పుష్ప 2' తరువాత సుకుమార్ ను పట్టుకోవడం టాలీవుడ్ కి కష్టమయ్యేలానే ఉంది.

Aamir Khan
Sukumar Movie
Bollywood
  • Loading...

More Telugu News