Somu Veerraju: జగన్ చెపుతున్న ప్రింటింగ్ మిషన్ కేంద్రం వద్ద ఉండదు: సోము వీర్రాజు

Somu Veerraju satires on Jagan

  • ఏపీకి రాజధాని లేకుండా చేసింది వైసీపీనేనన్న వీర్రాజు 
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు అప్పుల కోసం ఎందుకు పరిగెడుతున్నారని ప్రశ్న 
  • పోలవరం ప్రాజెక్టు ఏటీఎం కాకూడదని వ్యాఖ్య 

రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ మోసం చేయలేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీకి రాజధాని లేకుండా చేసింది వైసీపీనే అని మండిపడ్డారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో వెంటనే నిర్మాణాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. 

ఉండవల్లిలో 'మనం - మన అమరావతి' పేరుతో బీజేపీ పాదయాత్రను చేపట్టింది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ... రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల్లో ఏమేం చేస్తారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ మోసం చేయలేదని అన్నారు. రాజధానిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీలను కూడా కేంద్రమే నిర్మిస్తుందని చెప్పారు. కేంద్రం కంటే ఏపీ పరిస్థితే బాగుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండపడ్డారు. 

కేంద్రం కంటే రాష్ట్ర పరిస్థితి బాగుంటే... అప్పుల కోసం రోజూ ఎందుకు పరిగెడుతున్నారని ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు రాజధానిని ఎందుకు కట్టడం లేదని అడిగారు. ముఖ్యమంత్రి జగన్ చెపుతున్న ప్రింటింగ్ మిషన్ కేంద్రం వద్ద ఉండదని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ఆర్ అండ్ ఆర్ నివేదికను కేంద్రానికి రాష్ట్రం ఇవ్వడం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏటీఎం కాకూడదని వీర్రాజు చెప్పారు.

Somu Veerraju
BJP
Jagan
Vijayasai Reddy
YSRCP
  • Loading...

More Telugu News