Volodymyr Zelensky: మ్యాగజైన్ కవర్ పేజీ కోసం భార్యతో కలిసి జెలెన్‌స్కీ ఫొటోషూట్.. విమర్శల వెల్లువ!

Volodymyr Zelensky and Wife Appear On Vogue Cover
  • ‘వోగ్’ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్
  • ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన జెలెన్‌స్కీ భార్య
  • ఉక్రెయిన్‌లోని ప్రతి మహిళ కవర్ పేజీపై ఉండాలని కోరుకుంటున్నానన్న ఒలెనా
  • జెలెన్‌స్కీ ఫొటోషూట్‌ను నమ్మలేకపోతున్నామంటున్న నెటిజన్లు
రష్యాను ఎదిరించి హీరోగా కీర్తినందుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఒక్కసారిగా విమర్శలు మూటగట్టుకున్నారు. దేశం మొత్తం యుద్ధంతో అతలాకుతలం అవుతున్న వేళ భార్యతో కలిసి ఫొటోషూట్‌లో పాల్గొనడమే అందుకు కారణం. ప్రముఖ మ్యాగజైన్ అయిన ‘వోగ్’ కోసం జెలన్‌స్కా భార్య ఒలెనా జెలెన్‌స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ఈ సందర్భంగా భర్తతో కలిసి ఆమె ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. అధ్యక్ష భవనంలోనే జరిగిన ఈ ఫొటోషూట్‌లో ఇద్దరూ కలిసి పలు పోజులిచ్చారు. అలాగే, యుద్ధం కారణంగా దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులను ప్రపంచం ముందు ఉంచాలన్న ఉద్దేశంతో యుద్ధ ట్యాంకులు, సైనికులతో కలిసి ఒలెనా పోజులిచ్చారు.

అనంతరం ఈ ఫొటోలను ఒలెనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫొటో రావడం సాధారణ విషయం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తమ ఫొటోలు వోగ్ కవర్ పేజీపై రావాలని కలలు కంటారని ఒలెనా రాసుకొచ్చారు. వారి కల నెరవేరాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. అయితే, అందుకు యుద్ధం కారణం కాకూడదని అనుకుంటున్నానన్న ఒలెనా ఉక్రెయిన్‌లోని ప్రతి మహిళా తన స్థానంలో కవర్ పేజీపై ఉండాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. 

యుద్ధం కారణంగా శరణార్థి శిబిరాల్లో దయనీయంగా బతుకుతున్న ప్రతి మహిళకు ఈ కవర్ పేజీపై ఉండే హక్కు ఉందని అన్నారు. అయితే, ఈ ఫొటోషూట్ తర్వాత జెలెన్‌స్కీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా బాంబులతో విరుచుకుపడుతున్న వేళ జెలెన్‌స్కీ ఇలా ఫొటోషూట్‌లో పాల్గొన్నారంటే నమ్మలేకపోతున్నామని నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం వారికి అనుకూలంగా పోస్టులు చేస్తున్నారు.
Volodymyr Zelensky
Ukraine
Vogue
Russia
Olena Zelenska

More Telugu News