Chiranjeevi: చిరూకి సవతి తమ్ముడిగా రవితేజ?

Valther Veerrayya movie update

  • 'వాల్తేర్ వీరయ్య'గా చిరంజీవి 
  • ఆయన సరసన నాయికగా శ్రుతిహాసన్
  • రవితేజ జోడీగా కనిపించనున్న కేథరిన్
  • దర్శకత్వం వహిస్తున్న బాబీ  

చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు. జాలరుల గూడెం నేపథ్యంలో ఈ కథ నడవనుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగు మొదలైపోయింది. చిరంజీవి సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. 

ఈ సినిమాలో రవితేజ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు. చిరంజీవికి సవతి తమ్ముడుగా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడని అంటున్నారు. అంటే మణిరత్నం 'ఘర్షణ' సినిమాలో మాదిరిగా తండ్రి ఒకరే .. తల్లులు వేరు. రవితేజ పాత్రను కూడా బాబీ డిఫరెంట్ గా డిజైన్ చేశాడని అంటున్నారు. 

చిరంజీవి - రవితేజ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెచ్చేలా ఉంటాయని అంటున్నారు. రవితేజ సరసన కేథరిన్ కనిపించనుందని చెబుతున్నారు. సినిమా మొత్తం మీద రవితేజ పాత్ర నిడివి 40 నిమిషాల సేపు ఉండొచ్చని సమాచారం. చిరంజీవిని అన్నయ్య అని పిలిచే రవితేజ, ఆయనకి తమ్ముడి పాత్రలోనే చేస్తుండటం విశేషం.

Chiranjeevi
Sruthi Haasan
Bobby
Valther Veerayya Movie
  • Loading...

More Telugu News