Cell Phone: బాసర ట్రిపుల్ ఐటీలో సెల్ ఫోన్ వినియోగంపై నిషేధం... భగ్గుమంటున్న విద్యార్థులు

Ban on cell phones in Basara IIIT

  • డిమాండ్ల సాధన కోసం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పోరు
  • కీలక నిర్ణయం తీసుకున్న ఇన్చార్జి వీసీ
  • సెల్ ఫోన్ వాడకం నిషేధిస్తూ ఆదేశాలు జారీ
  • ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు డిమాండ్ల సాధన కోసం తీవ్రస్థాయిలో ఉద్యమించడం తెలిసిందే. తాజాగా, బాసర ట్రిపుల్ ఐటీలో  విద్యార్థులు సెల్ ఫోన్లు వినియోగించడంపై అధికారులు నిషేధం విధించారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని తరగతి గదులు, అకడమిక్ బ్లాక్ లు, పరిపాలనా భవనాల్లో సెల్ ఫోన్లు వినియోగించరాదంటూ ఇన్చార్జి వీసీ వెంకటరమణ ఆదేశాలు జారీ చేశారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 

సెల్ ఫోన్ వినియోగంపై నిషేధించడం పట్ల విద్యార్థులు భగ్గుమంటున్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని, డిమాండ్లను అణచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టూడెంట్ గవర్నెన్స్ కౌన్సిల్ మండిపడింది.

  • Loading...

More Telugu News