Tulasi Reddy: మోదీ వల్ల దేశం, జగన్ వల్ల ఏపీ పరిస్థితి దారుణంగా తయారయ్యాయి: తులసిరెడ్డి
![Tulasi Reddy fires on Modi and Jagan](https://imgd.ap7am.com/thumbnail/cr-20220724tn62dcfe978c220.jpg)
- మోదీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు
- ఈడీ, సీబీఐ వంటి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు
- ఏపీని జగన్ అప్పులపాలు చేశారు
ప్రధాని మోదీ, సీఎం జగన్ లపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. మోదీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పారు. విపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈడీ, సీబీఐ వంటి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పారు.
మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు కాంగ్రెస్ నేతలు భయపడబోరని అన్నారు. మోదీ పాలనలో భారత్, జగన్ పాలనలో ఏపీ పరిస్థితి దారుణంగా తయారయ్యాయని చెప్పారు. ఏపీని జగన్ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని విమర్శించారు. అప్పులు పుట్టకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని అన్నారు.