Allu Arjun: పది భాషల్లో విడుదల కానున్న 'పుష్ప 2'

Pushpa 2 movie update

  • సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
  • సెకండ్ పార్టు కోసం జరుగుతున్న సన్నాహాలు
  • త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న టీమ్ 
  • రంగంలోకి విజయ్ సేతుపతి .. మనోజ్ బాజ్ పాయ్  

అల్లు అర్జున్ - రష్మిక కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా ఆగస్టులోగానీ .. సెప్టెంబర్లో గాని రెగ్యులర్ షూటింగ్ కి వెళుతుందని అంటున్నారు. ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను, తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు. మరో ఐదు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లోను ఈ సినిమాను విడుదల చేయలనే నిర్ణయానికి తాజాగా వచ్చినట్టుగా చెబుతున్నారు. 

ఫస్టు పార్టులో బన్నీ .. రష్మిక .. ఫహాద్ .. సునీల్ .. అనసూయ పాత్రలు హైలైట్ గా నిలిచాయి. సెకండ్ పార్టులో కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతిని.. బాలీవుడ్ నుంచి మనోజ్ బాజ్ పాయ్ ను తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక మూడవ పార్టు కూడా ఉందనే విషయం ఫహాద్ ద్వారా బయటికి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Pushpa 2 Movie
  • Loading...

More Telugu News