Kadapa District: పులివెందులలో 50 ఏళ్ల హిజ్రాపై అత్యాచారం.. 8 మంది అరెస్ట్

8 arrested in hijra rape case in pulivendula

  • కదిరిలోని గంగమ్మ గుడి వద్ద అత్యాాచారం
  • దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన హిజ్రా
  • మరో ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

కడప జిల్లా పులివెందులలో 50 ఏళ్ల హిజ్రాపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పులివెందులకు చెందిన పి.చక్రధర్, కె.చలపతి, ఎ.బాలగంగిరెడ్డి, పి.గురుప్రసాద్, కె.కుమార్, ఎస్ బ్రహ్మయ్య, పి.జయచంద్రశేఖర్‌రెడ్డి, ఎం.హరికృష్ణారెడ్డి, చిన్న అలియాస్ తరుణ్, బాబావల్లి, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు సురేంద్ర, షాకీర్, సుభాష్ కలిసి ఓ పంచాయితీ విషయంలో రెండు వాహనాల్లో సత్యసాయి జిల్లాలోని రాగన్నగారిపల్లెకు వెళ్లారు. 

తిరిగి వస్తూ కదిరి రహదారిలోని గంగమ్మ గుడి దగ్గరకు చేరుకున్నారు. అక్కడ అప్పటికే ఉన్న ఇద్దరు హిజ్రాల్లో ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధిత హిజ్రా బుధవారం దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కదిరి ఆంజనేయ స్వామి గుడి సమీపంలో 8 మంది నిందితులను నిన్న అరెస్ట్ చేశారు. మరో ఐదుగురి కోసం గాలిస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

Kadapa District
Pulivendula
Hijra
Gang Rape
  • Loading...

More Telugu News