INS Vikramaditya: అతి పెద్ద విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం

Fire accident in INS Vikramaditya

  • కర్ణాటక లోని కార్వార్ తీరంలో ఉన్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య
  • మంటలను అదుపులోకి తెచ్చిన క్రూ సిబ్బంది
  • ఎలాంటి ప్రాణహాని కలగలేదన్న నేవీ అధికారులు

ఇండియన్ నేవీకి చెందిన భారీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటక తీర ప్రాంతంలో ఉన్న ఈ యుద్ధ నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే ప్రతిస్పందించిన క్రూ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని నేవీ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. 

ఈ విమాన వాహక నౌకను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. దీని విలువ 2.3 బిలియన్ డాలర్లు. 2014లో ఇది రష్యా నుంచి ఇండియాకు చేరుకుంది. ప్రస్తుతం కర్ణాటక తీరంలోని కార్వార్ లో ఈ నౌక ఉంది. ఈ విమాన వాహక నౌకపై మిగ్ 29కే ఫైటర్ జెట్లు, కమోవ్ హెలికాప్టర్లు ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య 284 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. 20 అంతస్తుల భవనం అంత ఎత్తును కలిగి ఉంటుంది. ఇండియన్ నేవీలో ఇదే అతి పెద్ద షిప్ కావడం గమనార్హం. దీని బరువు దాదాపు 40 వేల టన్నులు ఉంటుంది.

  • Loading...

More Telugu News