Naga Chaitanya: 'మానాడు' రీమేకులో రానా!

Maanadu movie remake

  • తమిళంలో హిట్ కొట్టిన 'మానాడు'
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు 
  • రీమేకులో రానా చేస్తున్నాడని చెప్పిన చైతూ
  • చైతూ తాజా చిత్రమైన 'థ్యాంక్యూ' ఈ నెల 22న రిలీజ్  

తమిళంలో శింబు - ఎస్.జె. సూర్య ప్రధానమైన పాత్రలను పోషించిన 'మానాడు' క్రితం ఏడాది నవంబర్ లో విడుదలైంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. అదే పేరుతో ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులు అమ్ముడుకావడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు.

అప్పటి నుంచి తెలుగు రీమేకులో ఈ సినిమా ఎవరు చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రీమేకులో రానా చేయనున్నాడనేది తేలిపోయింది. ఈ సినిమా రీమేకులో తాను చేయాలనుకున్నాననీ, కానీ అది రానా చేతికి వెళ్లిపోయిందని 'థ్యాంక్యూ' ప్రమోషన్స్ లో చైతూ చెప్పాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని అన్నాడు. 

'మానాడు' రీమేకులో ఛాన్స్ లేకపోయినా, ఆ దర్శకుడితో ఓ సినిమా చేస్తుండటం ఆనందంగా ఉందని చైతూ అన్నాడు. తరుణ్ భాస్కర్ .. పరశురామ్ మంచి కథలు చెప్పారనీ, తదుపరి సినిమాలను వాళ్లతో చేసే ఛాన్స్ ఉందని చెప్పాడు. ఇక త్వరలో రిలీజ్ కానున్న 'థ్యాంక్యూ' తన కెరియర్లో చెప్పుకోదగిన సినిమా అవుతుందని అన్నాడు.

Naga Chaitanya
Rana Daggubati
Maanadu Movie
  • Loading...

More Telugu News