R S Praveen Kumar: ప్రజా జీవితంలో ఏడాది పూర్తి!... ఐపీఎస్‌కు వీడ్కోలును గుర్తు చేసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్!

- గతేడాది జులై 19న ఐపీఎస్‌ను వదిలిన ఆర్ఎస్ ప్రవీణ్
- ఆపై బీఎస్పీలో చేరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన వైనం
- ఐపీఎస్‌కు రాజీనామా చేసిన లేఖను పంచుకున్న బీఎస్పీ నేత
ఖాకీ వదిలి ఖద్దరేసుకున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్... ఐపీఎస్ సర్వీసుకు వీడ్కోలు పలికి మంగళవారం నాటికి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది. రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న బలమైన కాంక్షతో సాగిన ప్రవీణ్ కుమార్... గతేడాది జులై 19న ఐపీఎస్ సర్వీస్‌కు స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో చేరిన ఆయన ఇటీవలే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
