Ptabhas: 'సలార్'లో మెరవనున్న యశ్!

Salaar movie update

  • ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'సలార్
  • ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి
  • అతిథి పాత్రల్లో కనిపించనున్న స్టార్స్ 
  • లోకేశ్ కనగరాజ్ బాటలో ప్రశాంత్ నీల్

ప్రభాస్ హీరోగా 'సలార్' సినిమా రూపొందుతోంది. 'కేజీఎఫ్' ను అందించిన నిర్మాణ సంస్థనే ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనిని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగును పూర్తిచేసుకుంది. ఈ ప్రాజెక్టులో ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. 

ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇక 'కేజీఎఫ్' హీరో యశ్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. తనకి సంచలన విజయాన్ని అందించిన దర్శక నిర్మాతలు అడిగిన కారణంగా యశ్ అంగీకరించాడని అంటున్నారు.

ఈ మధ్య కాలంలో ఒక స్టార్ సినిమాలో మరో స్టార్ సినిమాకి సంబంధించిన షేడ్స్ కనిపించేలా చూడటం కొత్త ట్రెండ్ గా మారింది. 'విక్రమ్' సినిమాలో కార్తి 'ఖైదీ' సినిమా ట్రాక్ కనిపించేలా లోకేశ్ కనగరాజ్ చేశాడు. ఇప్పుడు అదే విధంగా 'సలార్'లో యశ్ మెరవనున్నాడని చెబుతున్నారు. ఇక 'సలార్' కూడా రెండు భాగాలుగా రానుందనే టాక్ కూడా లేటెస్టుగా వినిపిస్తోంది.

Ptabhas
Sruthi Haasan
Prashanth Neel
Salaar Movie
  • Loading...

More Telugu News