Prabhas: భయంకరమైన లోయలో ప్రభాస్ భారీ ఫైట్!

Salaar movie update

  • షూటింగు దశలో 'సలార్'
  • యాక్షన్ సీన్ చిత్రీకరణకు ఏర్పాట్లు 
  • కీలకమైన పాత్రలో కనిపించనున్న జగపతిబాబు 
  • వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు

ప్రభాస్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'సలార్' పైనే ఉంది. 'కేజీఎఫ్' నిర్మాతలే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ కి సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం.

ఈ షెడ్యూల్లో భయంకరమైన ఒక లోయలో యాక్షన్ సీన్ ను ప్లాన్ చేశారట. డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఈ యాక్షన్ సీన్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇదే షెడ్యూల్లో ఒక భారీ ఛేజింగ్ సీన్ ను కూడా చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ప్రభాస్ పోర్షన్ ను ముగించనున్నట్టుగా తెలుస్తోంది. 

 ప్రభాస్ సరసన నాయికగా శ్రుతి హాసన్ నటిస్తుండగా, కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు. రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'కేజీఎఫ్ 2' స్థాయిలో ఈ సినిమా సంచలనాన్ని సృష్టిస్తుందేమో చూడాలి.

Prabhas
Sruthi Haasan
Prashanth Neel
Salaar Movie
  • Loading...

More Telugu News