Naga Chaitanya: 'థ్యాంక్యూ'లో ఎవరూ ఊహించని ట్విస్ట్!

Thank you movie update

  • విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'థ్యాంక్యూ'
  • నాగచైతన్య సరసన ముగ్గురు నాయికలు 
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • ఈ నెల 22వ తేదీన సినిమా విడుదల 

నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో చైతూ ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు.

తాజా ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ .. "సాధారణంగా విక్రమ్ కుమార్ సినిమాల్లో ఆడియన్స్ ఎంతమాత్రం ఊహించని ఒక ట్విస్ట్ ఉంటూ ఉంటుంది. అక్కడి నుంచే కథ రసవత్తరమైన మలుపు తిరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక ట్విస్ట్ ఈ సినిమాలోనూ ఉంటుంది .. అదే ఈ సినిమాకి హైలైట్ గా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు. 

చైతూ ఈ మాటతో ఈ సినిమాపై అందరిలో మరింత ఆసక్తిని పెంచాడు. ఈ సినిమాలో ఆయన మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన కథానాయికలుగా రాశి ఖన్నా .. మాళవిక నాయర్ .. అవికా గోర్ అలరించనున్నారు. ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.

Naga Chaitanya
Rashi Khanna
Thank You Movie
  • Loading...

More Telugu News