YSRCP: ఆటోవాలా చొక్కా వేసి.. మహిళా డ్రైవర్‌తో ఆటోలో కూర్చున్న జగన్
![ap cm ys jagan wears a ayrowala shirt in vizag tour](https://imgd.ap7am.com/thumbnail/cr-20220715tn62d1400845749.jpg)
- విశాఖ టూర్‌కు వెళ్లిన జగన్
- వైఎస్సార్ వాహన మిత్ర నిధుల విడుదల
- కార్యక్రమంలో ఆటోవాలా చొక్కాతోనే జగన్
విశాఖ పర్యటన సందర్భంగా శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సరికొత్త లుక్కులో దర్శనమిచ్చారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ఈ ఏడాది నిధులను విడుదల చేసే కార్యక్రమంలో పాలుపంచుకునే నిమిత్తం జగన్ శుక్రవారం విశాఖ వెళ్లిన సంగతి తెలిసిందే. విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన వేదిక మీద నుంచి వాహన మిత్ర నిధులను విడుదల చేసిన జగన్... ఆటోవాలాలతో ముఖాముఖీ భేటీ అయ్యారు.
![](https://img.ap7am.com/froala-uploads/20220715fr62d13ffbba6a2.jpg)