Team India: వన్డేల్లో బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన ఇదే!
![this is the best performance of jaspreet bumra in his odi career](https://imgd.ap7am.com/thumbnail/cr-20220712tn62cd87ad85ea2.jpg)
- 7.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన బుమ్రా
- 3 ఓవర్లను మైడెన్ ఓవర్లుగా మలచిన వైనం
- 6 వికెట్లలో ముగ్గురిని డకౌట్‌గా పంపిన బుమ్రా
- 7.2 ఓవర్లలో 19 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన బౌలర్
2022 ఏడాది టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు బాగానే కలిసి వచ్చినట్టుంది. ఈ ఏడాదిలోనే ఓ టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్న బుమ్రా... తాజాగా మంగళవారం నాటి వన్డే మ్యాచ్‌లో తన వన్డే కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనను కనబరచాడు. లండన్‌లోని ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన బుమ్రా.. కేవలం 7.2 ఓవర్లలోనే 6 వికెట్లు తీశాడు. ఇదే అతడి వన్డే కెరీర్‌లో బెస్ట్ ఫెర్‌ఫార్మెన్స్‌గా రికార్డుల్లోకి ఎక్కింది.
ఈ మ్యాచ్‌లో బుమ్రా వేసింది కేవలం 7.2 ఓవర్లు మాత్రమే. అయితే ఈ 7 ఓవర్లలో బుమ్రా సమర్పించుకున్న పరుగులు మాత్రం 19 మాత్రమే. ఇక తాను సంధించిన 7.2 ఓవర్లలో మూడు ఓవర్లలో అసలు ఒక్క పరుగు కూడా ఇవ్వని బుమ్రా... 3 మైడెన్ ఓవర్లను విసిరాడు. ఇక తాను ఆరుగురు ఇంగ్లండ్ బ్యాటర్లను అవుట్ చేస్తే... అందులో 3 డకౌట్లు ఉండటం గమనార్హం. మొత్తంగా తన వన్డే కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రతిభను ఈ మ్యాచ్‌లో బుమ్రా నమోదు చేసుకున్నాడు.