rupee: పుంజుకోని రూపాయి.. కొత్త కనిష్ఠ స్థాయి నమోదు
- డాలర్ తో 79.57కు చేరిక
- 108.3కు డాలర్ ఇండెక్స్
- రూపాయిపై విదేశీ ఇన్వెస్టర్లు, దిగుమతుల ప్రభావం
రూపాయి మరింత బలహీనతను ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయ డాలర్ బలపడడం రూపాయి బలహీనతల్లో ఒకటి. దీనికితోడు పెరిగిన ముడి చమురు ధరల వల్ల భారత్ దిగుమతుల కోసం ఎక్కువ మొత్తంలో డాలర్లను వెచ్చించాల్సి వస్తోంది. అంతెందుకు.. బంగారం రూపంలోనే దిగుమతుల బిల్లు పెరిగిపోతోంది. వీటికితోడు విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను క్రమంగా తరలించుకుపోతూనే ఉన్నారు.