Drink: ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోగలిగే డ్రింక్... శరీరం శుభ్రపడుతుంది, బరువు కూడా తగ్గుతారు!

Easy made detox drink makes weight loss easier

  • చాలామందిని వేధిస్తున్న అధిక బరువు సమస్య
  • మూడు దినుసులు, నీళ్లతో వెయిట్ లాస్
  • జీలకర్ర, సోంఫు, వాముతో డ్రింక్
  • ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందట!

ఇప్పటి రోజుల్లో అధిక బరువు సమస్య అనేకమందిని వేధిస్తుంటుంది. బరువు అధికంగా పెరిగితే అనేక జీవనశైలి జబ్బులు చుట్టుముడుతుంటాయి. తినే ఆహారం, నిద్ర సమయాల్లో మార్పులు, అధిక ఒత్తిళ్లు ఇవన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపడమే కాదు అధిక బరువుకు దారితీస్తుంటాయి. 

కాగా, అధిక బరువు నుంచి విముక్తి కలిగిస్తామంటూ ఇంటర్నెట్లో అనేక తరుణోపాయాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో కొన్ని ఖర్చుతో కూడుకున్నవి కాగా, మరికొన్ని నిపుణుల పర్యవేక్షణలోనే చేయదగినవి ఉంటాయి. ఈ నేపథ్యంలో, చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారుచేసుకోగలిగే వీలున్న ఓ డ్రింక్ చాలా ఉపయుక్తంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పానీయం బరువును తగ్గించడమే కాదు, శరీరంలోని మలినాలను బయటకు పారదోలుతుంది. వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచుతుందట. 

ఈ పానీయం తయారుచేయడానికి మన ఇంట్లోనే ఉండే దినుసులు సరిపోతాయి. జీలకర్ర, వాము, సోంపు గింజలతో తయారయ్యే ఈ పానీయం ఓ ఇమ్యూనిటీ డ్రింక్ గా భావించవచ్చు. 

జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విషపదార్థాలను నిర్మూలిస్తాయి. తద్వారా జీలకర్ర శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుంది. అంతేకాదు, జీర్ణక్రియకు ఇది ఎంతో ఉపయోగకారి. పైగా జీవక్రియలు సాఫీగా సాగడంలో సహాయపడుతుంది. రోజూ ఉదయం జీలకర్ర కలిపిన నీళ్లు ఒక గ్లాసు తాగితే బరువు తగ్గడమే కాదు, ఆరోగ్యం కూడా ఎంతో మెరుగవుతుందని బెంగళూరుకు చెందిన పోషకాహార డాక్టర్ అంజు సూద్ వెల్లడించారు. 

ఇక వాము విషయానికిస్తే... అరుగుదలను వేగవంతం చేస్తుంది. అదనపు బరువు పెరగడాన్ని ఇది నిరోధిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు వామును తప్పక తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మనం మసాలా దినుసులుగా, వంటకాల్లో సువాసన కోసం ఉపయోగించే సోంపు గింజల్లోనూ ఔషధ విలువలు పుష్కలంగా ఉన్నాయని మాక్రోబయోటిక్, పోషకాహార నిపుణురాలు శిల్పా అరోరా తెలిపారు. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి జీవక్రియలు మరింత సజావుగా జరిగేలా సోంపు తోడ్పడుతుంది. ముఖ్యంగా, మనం తినే ఆహారం నుంచి పోషకాలను శరీరం గ్రహించేందుకు ఈ సోంపు సహాయకారిగా ఉంటుంది. దాంతో శరీరం శక్తిమంతమవుతుంది. తద్వారా పదేపదే ఆకలి వేయడం, అదే పనిగా తినడం తగ్గిపోతుంది. ఆ విధంగా అధిక బరువు నియంత్రణలో సోంపు ఉపయోగపడుతుంది.

ఈ మూడు దినుసులతో డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలంటే...

అర లీటరు నీటిలో ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను వాము, ఒక స్పూను సోంఫు వేసి బాగా కలియదిప్పాలి. రాత్రంతా వాటిని నానబెట్టాలి. ఉదయానికల్లా పానీయం రెడీ. దీన్ని పరగడుపునే తాగాల్సి ఉంటుంది.

Drink
Detox
Weight Loss
Ajwain
Saunf
Jeera
  • Loading...

More Telugu News