Vladimir Putin: 69 ఏళ్ల వయసులో మరోమారు తండ్రి కాబోతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

Vladimir Putin to become dad again at 69 years old

  • అమ్మాయికి జన్మనివ్వబోతున్న పుతిన్ ప్రియురాలు!
  • ఆమెకు ఇప్పటికే ఇద్దరు కుమారులు, ఇద్దరు కవల అమ్మాయిలు
  • మాజీ భార్యతో మరో ఇద్దరు కుమార్తెలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 69 ఏళ్ల వయసులో మరోమారు తండ్రి కాబోతున్నారు. మాజీ జిమ్నాస్ట్ అయిన ప్రియురాలు అలీనా కబేవా (39) త్వరలోనే ఓ అమ్మాయికి జన్మనివ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఒలింపిక్ గోల్డ్‌మెడలిస్ట్ అయిన ఆమెకు పుతిన్ ద్వారా ఇప్పటికే ఇద్దరు కుమారులు, మరో ఇద్దరు కవల అమ్మాయిలు ఉన్నట్టు చెబుతున్నారు. అయితే, వారి వివరాలు మాత్రం రహస్యంగానే ఉన్నాయి. 

అలాగే, మాజీ భార్య లియుద్ మిలాతో పుతిన్‌కు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరైన మారియా వొరొత్సోవా (37) వ్యాపారవేత్త. మరో కుమార్తె కేటెరినా (35) శాస్త్రవేత్త, మాజీ డ్యాన్సర్. 

పుతిన్ వ్యక్తిగత జీవితం అత్యంత రహస్యంగా ఉంటుంది. కేబేవా 2015లో స్విట్జర్లాండ్‌లోని ఓ క్లినిక్‌లో ఓ బాబుకు జన్మనిచ్చినట్టు ‘యూకే మిర్రర్’ పేర్కొంది. అలాగే, 2019లో మాస్కోలో కవలలకు జన్మనిచ్చిందని తెలిపింది.

Vladimir Putin
Russia
Alina Kabaeva
  • Loading...

More Telugu News