Samosa: ‘బాహుబలి’ సమోసా.. అరగంటలో తింటే రూ.51 వేలు బహుమతి!

51k cash prize for bahubali samosa challenge

  • ప్రచారం కోసం ఉత్తర ప్రదేశ్ లో ఓ స్వీట్ దుకాణం ఆఫర్
  • ఎనిమిది కిలోల బరువుతో అతిపెద్ద సమోసా తయారీ
  • చాలా మంది ప్రయత్నించినా ఒక్కరూ పూర్తి చేయలేదు

అక్కడక్కడా తిండి పోటీలు జరగడం మామూలే. కారం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను పెడుతూ చాలెంజ్ చేస్తుంటారు. అలాంటివి కొంచెం ఇబ్బందికరమే. అదేదో సింపుల్ గా ఒకే ఒక సమోసా తింటే చాలు.. రూ.51 వేలు ఇస్తామంటే ఏం చేస్తారు? ఒక్క సమోసాయేనా.. కళ్లుమూసి తెరిచేలోపు లాగించేయొచ్చని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇది ‘బాహుబలి’ సమోసా.. ఏకంగా ఎనిమిది కిలోల బరువుతో తయారు చేశారు. దాన్ని అర గంటలో తినేస్తే.. రూ.51 వేలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన కౌశల్ స్వీట్ షాప్ ఈ ఆఫర్ పెట్టింది.

షాప్ కు ప్రచారం కోసమని..
మీరట్ కు చెందిన శుభమ్ అనే యువతి తమ స్వీట్ షాప్ కు బాగా ప్రచారం వచ్చేందుకు ఏం చేయాలని ఆలోచించింది. ఏదైనా సరికొత్తగా చేయాలన్న ఉద్దేశంతో పేద్ద సమోసాను తయారు చేసింది. ఆలూ, వెన్న, బఠానీ, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి 8 కిలోల సమోసాను రూపొందించి.. ఆఫర్ పెట్టింది. ఆ సమోసాను అర గంటలో తిన్నవాళ్లకు రూ.51 వేలు బహుమతి ఇస్తానని ప్రకటించింది. ఆ నోటా ఈ నోటా దీనిపై బాగా ప్రచారం జరిగింది. కొందరు ఈ ‘బాహుబలి’ సమోసాను తినేందుకు ప్రయత్నించినా.. అర గంటలో పూర్తి చేయలేకపోయారు. ఇది మెల్లగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అనుకున్నదానికంటే ఎక్కువ ప్రచారం వచ్చింది.

More Telugu News