Shinzo Abe: షింజో అబే మృతికి చంద్రబాబు సంతాపం... ఏపీకి స్నేహితుడని అభివర్ణన

- దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన అబే
- వార్త తెలిసిన వెంటనే స్పందించిన చంద్రబాబు
- సోషల్ మీడియా వేదికగా మాజీ ప్రధానికి నివాళి అర్పించిన వైనం
జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే మృతిపై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అబే మృతి చెందినట్లు తెలిసిన వెంటనే సోషల్ మీడియా వేదికగా అబే మృతికి సంతాపం ప్రకటించారు. జపాన్‌లోని నరా నగరంలో ఎన్నికల సందర్భంగా ప్రసంగిస్తున్న షింజోపై దుండగుడు కాల్పులు జరపగా... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందిన సంగతి తెలిసిందే.
