Nirmala Sitharaman: రాజ్యసభ సభ్యులుగా జైరాం రమేశ్, నిర్మలా సీతారామన్ ప్రమాణం

- ఇటీవలే రాజ్యసభ పదవీ కాలం పూర్తి చేసుకున్న నేతలు
- మరోమారు రాజ్యసభకు ఎన్నికైన నిర్మల, జైరాం
- 31 మందితో ప్రమాణం చేయించిన రాజ్యసభ చైర్మన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ రాజ్యసభ సభ్యులుగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇదివరకే వీరిద్దరూ రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పటికీ... తాజాగా వీరి పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలో ఇటీవలే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ నుంచి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ నుంచి జైరాం రమేశ్‌లు మరోమారు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
