BJP: పార్ల‌మెంటు మెట్ల‌కు దండం పెట్టి... ఎంపీగా పెద్ద‌ల స‌భ‌లోకి అడుగుపెట్టిన ల‌క్ష్మ‌ణ్‌

bjp leader laxman takes oath as rajyasabha
  • రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నికైన ల‌క్ష్మ‌ణ్
  • యూపీ కోటా నుంచి సీటు ఇచ్చిన బీజేపీ
  • ఎంపీగా ప్ర‌మాణ స్వీకారం చేసిన సీనియ‌ర్ నేత‌
తెలంగాణ‌కు చెందిన బీజేపీ సీనియ‌ర్ నేత కె.ల‌క్ష్మ‌ణ్ శుక్రవారం ఎంపీ హోదాలో పార్ల‌మెంటు భ‌వ‌న్‌లోకి అడుగుపెట్టారు. ఇటీవ‌ల జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఉత్త‌రప్ర‌దేశ్ కోటా నుంచి ల‌క్ష్మ‌ణ్ ఎంపీగా ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం 31 మంది కొత్త ఎంపీలు రాజ్య‌స‌భ స‌భ్యులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. వీరిలో  ల‌క్ష్మ‌ణ్ కూడా ఉన్నారు. 

సుదీర్ఘ కాలం పాటు బీజేపీ తెలంగాణ శాఖ‌కు పెద్ద దిక్కుగా వ్య‌వ‌హ‌రించిన ల‌క్ష్మ‌ణ్... బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా, ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో బీజేపీ ప‌క్ష నేత‌గా వ్య‌వహ‌రించారు. ఇక‌పై ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొత్త ప్ర‌స్థానాన్ని ప్రారంభించ‌నున్నారు. పార్ల‌మెంటు భ‌వ‌నంలోకి ఎంపీ హోదాలో తొలిసారిగా అడుగుపెట్టిన సంద‌ర్భంగా ల‌క్ష్మ‌ణ్ పార్లమెంటు భ‌వ‌న్ మెట్ల‌కు దండం పెట్టారు. ఈ ఫొటోల‌ను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశారు.
BJP
K.Laxman
Telangana
Rajya Sabha
Uttar Pradesh
Parliament

More Telugu News