Kakatiya: మా పూర్వీకుల గడ్డకు రావడం సంతోషంగా ఉంది: కాకతీయుల వారసుడు భంజ్ దేవ్

Kakatiya king Kamal Chandra visits Warangal

  • కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • వేడుకలకు విచ్చేసిన కమల్ చంద్ర భంజ్ దేవ్
  • కాకతీయుల 22వ తరం వారసుడు భంజ్ దేవ్

తెలుగు రాష్ట్రాల్లో కాకతీయుల వైభవం చాలా గొప్పది. ఓరుగల్లు రాజధానిగా వీరి పాలన ఎంతో ఉన్నతంగా కొనసాగింది. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు తెలంగాణ ప్రభుత్వం వారం రోజుల పాటు కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహిస్తోంది. కాకతీయుల 22వ తరం వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ ఈ వేడుకలను ప్రారంభించారు. ఆయన ఈరోజు వరంగల్ కు చేరుకుని భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ వంశస్తుల గడ్డకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తాము ఎప్పుడూ ప్రజా సేవకు కట్టుబడి ఉంటామని... బస్తర్ ప్రాంతంలో తమ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాకతీయ ఉత్సవాలను నిర్వహిస్తుండటం తమకు గర్వంగా ఉందని... వేడుకలకు తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News