Chandrababu: ఈరోజు నుంచి రాయలసీమలో మూడు రోజులు పర్యటించనున్న చంద్రబాబు!

Chandrababu to visit Rayalaseema districts today
  • చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పర్యటించనున్న చంద్రబాబు
  • మినీ మహానాడులు, నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించనున్న బాబు
  • భారీ ఏర్పాట్లు చేసిన టీడీపీ శ్రేణులు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు నుంచి మూడు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో మినీ మహానాడులు నిర్వహించనున్నారు. 

నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేబట్టి, రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు. దీనికితోడు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు పార్టీ అధినేత పర్యటనల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Chandrababu
District Tours
Annamayya District
Chittoor District

More Telugu News